నిజామాబాద్ జిల్లా నంది చౌక్ మండల కేంద్రంలో తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తల్వేద ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేవంటూ వాపోయారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు, రాజకీయనాయకులకు విన్నవించినా ఫలితంలేకపోవడం వల్లనే రోడ్డెక్కినట్లు తెలిపారు. కనీసం కుల సంఘాల నిధులివ్వడంలో చూపిన ప్రాధాన్యత కూడా పాఠశాలలను బాగుచేయడంలో చూపకపోవడం బాధకరమన్నారు. పేదవారిగా తమ పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు... అలాంటి దాని విషయంలో రాజీపడబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
' పిల్లలకు మేము ఇచ్చే ఆస్తి చదువే...' - school
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే ముందు స్కూలు బాగు చేయండి సార్ అంటూ నందిపేట మండలంలోని నంది చౌక్ దగ్గర తల్లిదండ్రులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
రిలే నిరాహార దీక్ష