ఘన స్వాగతం
'దిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరాలి' - kavitha
దిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరాలని కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
కవిత
అనంతరం ధర్పల్లి మండల కేంద్రంలో బహిరంగసభకు హాజరయ్యారు. తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనర్యాలీతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. బంజరా మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు. మరోసారి ఆశీర్వదించాలని కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్ జడ్పీ వైస్ ఛైర్మన్ సుమనరెడ్డితో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:"పాక్ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి"
Last Updated : Mar 31, 2019, 8:09 PM IST