తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు

Telangana University Issues : వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీలో ఇబ్బందులు చుట్టుముట్టాయి. లంచం తీసుకుంటూ దొరికిపోయి ఉపకులపతి రవీందర్‌ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల జీతాల విషయంలో ఈ నెల ఏదోలా గడిచినా.. ఇతర బిల్లులపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశముంది.

tu
tu

By

Published : Jul 3, 2023, 9:17 AM IST

వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు

Problems in Telangana University :తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలనా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలి, ఉపకులపతి మధ్య సాగిన విభేదాలు.. ఇవి కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో వీసీ రవిందర్​ అనిశాకు పట్టుబడి జైలుకెళ్లారు. డ్రాయింగ్‌ ఆఫీసర్‌గా రిజిస్ట్రార్‌ బ్యాంకు చెక్కులు, బిల్లులపై సంతకాలు చేసినా వాటికి నోట్‌షీట్‌ను అనుమతిస్తూ వీసీ సంతకం చేయాలి.

Telangana University Latest Updates :జూన్‌ వేతనాల చెల్లింపునకు సమస్య నెలకొనడంతో రిజిస్ట్రార్‌.. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలవగా ప్రస్తుతానికి వేతనాల బిల్లుల వరకు అనుమతించేలా ఆమె లేఖ ఇచ్చారు. వీసీ రవీందర్‌పై గతంలోనేనిధుల దుర్వినియోగం ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ జరిపించాలని పాలకమండలి తీర్మానం చేసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జూన్‌ 6న సోదాలు నిర్వహించి కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, పలు దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. 13న మరోమారు విచారణ జరిపారు. రూ.8 కోట్ల వరకు నిధుల వినియోగంలో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించినట్లు బయటకొచ్చింది. వీసీపై చర్యలుంటాయని చర్చ సాగుతుండగానే గత నెలలో ఆయన అనిశాకు చిక్కారు.

Telangana University Issues : ఉపకులపతిని తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. ప్రభుత్వం గవర్నర్‌కు నివేదిక పంపితే అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం ఏడాదే ఉంది. ఆయన్ను తప్పిస్తూ ఉత్తర్వులిచ్చి, నిర్ణయాన్ని గవర్నర్‌కు నివేదిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అనంతరం విద్యాశాఖ మరొకరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. ఇంతవరకు అలాంటి ప్రయత్నాలేవీ జరగకపోవడంతో పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి : ఓ ప్రైవేట్ కళాశాల పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50,000 లంచం తీసుకుంటూతెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ దాచేపల్లి రవీందర్‌ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డాడు. ఇలా ఓ ఉపకులపతి.. అవినీతికి పాల్పడుతూ పట్టుబడటం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్‌ సొసైటీలో గతంలో డిగ్రీ పరీక్ష నిర్వహణ కేంద్రముండేది.

కొంతకాలం క్రితం రద్దు చేయగా.. దాన్ని పునరుద్ధరించాలంటూవీసీ రవీందర్‌ను సొసైటీ అధ్యక్షుడు దాసరి శంకర్‌ కలిశారు. ఇందుకు వీసీ రూ.50,000 డిమాండ్‌ చేయగా.. వారి మధ్య ఒప్పందం కుదరడంతో పరీక్ష కేంద్రం నిర్వహణకు అనుమతి లభించింది. ఈ క్రమంలో లంచం సొమ్మును హైదరాబాద్‌ తార్నాక కమిటీ కాలనీలోని తన ఇంటికి తీసుకురావాలని రవీందర్‌ సూచించారు. లంచం విషయమై ఉప్పందడంతో అనిశా అధికారులు తార్నాకలో మాటువేసి పట్టుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details