నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఊట్పల్లిలో సురేందర్, ఉమ వారి కుమార్తె పల్లవి నివాసముంటున్నారు. లాక్డౌన్ సమయంలో బోధన్‌కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు ఊట్పల్లి గ్రామానికి వెళ్లి పల్లవిని తమ పాఠశాలలో చేర్పించండి అని అభ్యర్థించారు.
'మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదు.. తీసుకెళ్లిపోండి' - విద్యార్థికి ప్రవేశం నిలిపివేసిన స్కూలు యాజమాన్యం
తమ స్కూల్లో బాలికను చేర్పించాలని యాజమాన్యం తల్లిదండ్రులను కోరగా... వారు ఒప్పుకున్నారు. ఆన్‌లైన్ తరగతుల కోసం సెల్‌ఫోన్ కూడా కొన్నారు. క్లాసులు విన్న తర్వాత.. మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదంటూ యాజమాన్యం అడ్డుకున్న ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది.
'మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదు.. తీసుకెళ్లిపోండి'
తల్లిదండ్రులు బాలికను స్కూలులో చేర్చి... ఆన్‌లైన్ తరగతుల కోసం ఫోన్ కూడా కొన్నారు. ఇన్ని రోజులు క్లాసులు విన్న బాలికకు ఇప్పుడు ప్రవేశం లేదని చెప్పారు. మనస్తాపానికి గురైన ఉమ.. కూతురుతో కలసి పాఠశాల ముందు బైఠాయించింది. తమ బిడ్డ చదువుకోవడానికి సీటు ఇప్పించి.. సహాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:ఇంకా సవాళ్ల మధ్యే 'ఆన్‌లైన్' అభ్యసనం!