తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 20 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల - నిజామాబాద్​ జిల్లా వార్తలు

ఈ నెల 20వ తేదీ నుంచి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కొరకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి నీటిని విడుదల చేయనున్నారని ఆధికారులు ప్రకటించారు.

srsp water release from the 20th of this month
ఈ నెల 20 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

By

Published : Jul 17, 2020, 4:12 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కొరకు ప్రాజెక్ట్ ప్రధాన కాలువలైన కాకతీయ, లక్ష్మీకాలువల ద్వారా ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఈ నెల 20న ఉదయం రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. కాలువల ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని.. తమ మోటార్లు, పైపులు, వైర్లను జాగ్రత్త పరచుకోవాలని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు.


ఇవీ చూడండి: కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్​డౌన్​..

ABOUT THE AUTHOR

...view details