నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని గాంధీనగర్ కాలనీవాసులు అందరూ కలిసి ఐక్యమత్యంతో దాదాపు గత 30 సంవత్సరాలుగా ఒకే వినాయకున్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. విఘ్నాలు తొలగించు గణనాథా అంటూ.. నిత్యం పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అందరూ కలిసి ఒకేచోట చేరడం.. చాలా ఆనందంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు.
30 ఏళ్లుగా ఒకే వినాయక మండపం.. - నిజామాబాద్
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు.. వాడ ఉత్సవాలు.. వీధికో గణపతి.. ఊరంతా పండుగ వాతావరణం. కానీ దాదాపు 120 కుటుంబాలు నివాసం ఉంటున్న ఆ కాలనీలో 30 సంవత్సరాలుగా ఒకే గణపయ్య మండపాన్ని ఏర్పాటుచేశారు వీరు!
30ఏళ్లుగా ఒకే వినాయక మండపం..