సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పర్యటించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రైల్వే స్టేషన్లోని అన్ని విభాగాలను పరిశీలించి... ముఖ్యంగా ప్లాట్ ఫాం విస్తరణ పనులు చేస్తామని గజానన్ మాల్యా తెలిపారు.
రైల్వే స్టేషన్ని సందర్శించిన గజానన్ మాల్యా - రైల్వే స్టేషన్ని సందర్శించిన గజానన్ మాల్యా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా భూమిపూజ చేశారు.
రైల్వే స్టేషన్ని సందర్శించిన గజానన్ మాల్యా
రైల్వే స్టేషన్ను సోలార్ స్టేషన్గా మారుస్తామన్నారు. అలాగే ప్రయాణికుల అవసరాల నిమిత్తం నాలుగు ఫుట్ బోర్డు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు రైళ్లను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: దిల్లీ, మహారాష్ట్రలో 'పౌర'చట్టంపై నిరసనజ్వాల