నగర పరిశుభ్రతకు అహర్నిశలు కృషి చేసే కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ అన్నారు. కొవిడ్ రోజురోజుకూ విజృంభిస్తోందని పారిశుద్ధ్య కార్మికులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై.. కార్మికులకు మందుల కిట్‌ను అందజేశారు.
‘పారిశుద్ధ్య కార్మికులను కాపాడాల్సిన అవసరముంది’
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ నీతూ కిరణ్.. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను కార్మికులకు వివరించారు.
nizamabad muncipality
కార్మికులంతా.. కొవిడ్ నిబంధనలను పాటించాలని మేయర్ కోరారు. వైరస్‌ను కట్టడి చేయడానికి తమవంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు నటరాజ్ గౌడ్, ప్రభుదాస్, ఇంఛార్జీ ఇన్స్పెక్టర్లు మహిపాల్, శ్రీకాంత్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పారిశుద్ధ్య కార్మికులను జాగ్రత్తగా చూసుకుంటున్నాం : కేటీఆర్