తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

నిజామాబాద్​ జిల్లా సాటపూర్​ గేట్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident and one died in nizamabad district
డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

By

Published : Jul 5, 2020, 9:00 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు కారులో వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే టైర్ పేలి డివైడర్​ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే అర్బాస్ (21) మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కడుపునొప్పి భరించలేక ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details