తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రుల్లో సాధారణ వైద్యసేవలు పునః ప్రారంభం - నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిని డీఎంఈ రమేశ్​రెడ్డి సందర్శించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో.. కొవిడ్ కారణంగా నిలిపివేసిన సాధారణ వైద్య సేవలను పునః ప్రారంభించినట్లు వెల్లడించారు.

Resumption of general medical services in hospitals clarified nizamabad dme
ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు పునః ప్రారంభం

By

Published : Feb 18, 2021, 11:46 AM IST

నిజామాబాద్​ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను ప్రారంభించామని డీఎంఈ రమేశ్​రెడ్డి తెలిపారు. కొవిడ్ కారణంగా గత ఏడాదంతా అత్యవసర సేవలకే పరిమితమయ్యామని గుర్తుచేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు.

ఆస్పత్రిలోని.. వైద్య సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు డీఎంఈ. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

ABOUT THE AUTHOR

...view details