తెలంగాణ

telangana

ETV Bharat / state

Fish Hunting: చెరువులైన పొలాలు... చేపల కోసం ఎగబడ్డ స్థానికులు.. - గ్రామస్తుల చేపల వేట

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి వానలతో నిండుకుండల్లా మారిపోయాయి. నిజామాబాద్​ జిల్లాలో పలు చోట్ల చెరువుల్లో నీరు బయటకు రావడంతో స్థానికులు చేపల కోసం ఎగబడుతున్నారు.

Fish Hunting
చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

By

Published : Jul 23, 2021, 3:53 PM IST

చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా కనువిందు చేస్తున్నాయి. చెరువులు, వాగులు, కుంటలు అలుగు పారుతున్నాయి. నిజామాబాద్​ జిల్లాలో సైతం మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, చెరువులు అలుగు పారుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల అలుగు పారుతున్నచెరువుల నుంచి చేపలు పొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. దీంతో చేపలను పట్టుకునేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.

వీరికి ఆనందం..

వాటిని చూడగానే చిన్న పిల్లల్లా పరుగులు తీస్తూ... ఒకరిని ఒకరు తోసుకుంటూ చేపల కోసం ఎగబడ్డారు. గ్రామాలకు దగ్గరే చెరువు ఉండడంతో చిన్నా, పెద్ద చేపల వేటలో మునిగిపోయారు. వలలు, కర్రలు, చేతులతో చేపలను పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ... పోటీపడ్డారు. దొరికిన వారు సంతోషంగా ఇంటికి తీసుకెళ్తున్నారు.

గంగపుత్రుల ఆవేదన

ఇదిలా ఉండగా చెరువుల నుంచి చేపలు కొట్టుకుపోకుండా గంగపుత్రులు ప్రయత్నిస్తున్నారు. కిలోల బరువు పెరిగిన చేపలు.. అమ్ముకుందామనుకునే సమయంలో ఇలా కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:fishes: రోడ్లు, పొలాల్లో చేపలు.. పట్టుకునేందుకు జనాల పరుగులు.!

ABOUT THE AUTHOR

...view details