తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో మొదలైన రెండో విడత నామినేషన్లు - bodhan

బోధన్ నియోజకవర్గంలో రెండో విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున నామపత్రాల సమర్పణ మందకొడిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మందకొడిగా రెండో విడత నామినేషన్లు

By

Published : Apr 26, 2019, 3:12 PM IST

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బోధన్​లో ఇప్పటివరకు జడ్పీటీసీ స్థానానికి 1, ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. బోధన్, ఎడ్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.

మందకొడిగా రెండో విడత నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details