నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. లక్ష్మణుడు లేకుండా రాముడు కొలువుండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి ఉదయం జన్మదిన వేడుకలు జరిపి, రాత్రి కల్యాణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ రామయ్య సీతమ్మ మెడలో మాంగల్య ధారణ చేశారు. వేడుకలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
లక్ష్మణుడు లేని ఆలయంలో రామయ్య కల్యాణం - ఇందల్వాయి రామాలయం
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందల్వాయి మండలంలో లక్ష్మణుడు లేని రామాలయంగా ఖ్యాతి గాంచిన గుడిలో రామయ్య కల్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు.
రామయ్య కల్యాణం