నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఆర్డీవో కార్యాలయంలో కార్మిక ఉద్యోగ సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వామపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి నెలకు రూ.7,500 ఇస్తూ... పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వారు పేర్కొన్నారు.
'ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి' - bodhan rdo office news
లాక్డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి నెలకు రూ.7,500 ఇచ్చి... వారి కుటుంబాలను ఆదుకోవాలని వామపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.
'ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'