తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరల్​: ఆస్పత్రి వరండాలోనే శవ పంచనామా - a deadbody's post mortem has taken place at hospital's bolcony in nizamabad district at bodhan govt hospital

ఆస్పత్రిలో స్థలం లేక వరండాలోనే శవానికి పంచనామా చేసిన ఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్​ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

post mortem of a deadbody has taken place at hospital's bolcony in nizamabad district at bodhan govt hospital

By

Published : Jul 22, 2019, 10:48 AM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ ప్రభుత్వాసుపత్రి వరండాలో శవపరీక్ష చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న వరసగా మూడు శవాలు పోస్టుమార్టం కోసం వచ్చాయి. ఒకేసారి రావడం వల్ల లోపల స్థలం సరిపోలేదు. వరండాలోనే శవపరీక్ష జరిపారు. నీటిలో మునిగిన మృతదేహం కావడం వల్ల కదపడానికి కూడా వీలు లేకపోయిందని... కుటుంబ సభ్యులు కూడా తొందరగా చేయాలని హడావుడి చేశారని, అందువల్లే వరండాలో శవ పంచనామా చేశామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

వైరల్​: ఆస్పత్రి వరండాలోనే శవ పంచనామా

For All Latest Updates

TAGGED:

nzb

ABOUT THE AUTHOR

...view details