నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏరియా ఆస్పత్రిలో పోలియో చుక్కల కేంద్రాన్ని ఆర్డీఓ గోపిరామ్ ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని ఆర్డీఓ అన్నారు.
'పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత' - పోలియో చుక్కలు
నిజామాబాద్ జిల్లా భోదన్ పట్టణంలో పల్స్ పోలియో ఆదివారాన్ని పురస్కరించుకుని 269 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని ఆర్డీఓ గోపిరామ్ తెలిపారు. 5 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లలకు పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని ఆయన సూచించారు.
'పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత'
బోధన్ పట్టణంలో 269 బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తున్నారని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య కరమైన పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్