లాక్డౌన్ అమల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఒకసారి పట్టుబడ్డ వాహనాలు మరోసారి దొరికితే తీవ్ర చర్యలుంటాయని సీపీ కార్తికేయ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితిలోను రోడ్లపైకి రావొద్దని సూచించారు. కొందరు మంది మెడికల్ ఉద్యోగులుగా రోడ్లపై తిరుగుతున్నారని... ఐడీ కార్డులు లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని... ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ కార్తికేయ హెచ్చరించారు. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ