రాష్ట్రంలో ఉదయం పది గంటల నుంచే లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా కొందరు వ్యాపారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో 11 దాటితేనే లాక్డౌన్ వాతావరణం కనిపిస్తోంది. రోజూ పది గంటలు దాటినా జనాలు రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
రోడ్లపై జనసంచారం.. మినహాయింపే సాకు! - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని ప్రకటించినా కొందరి తీరు మారడం లేదు. 11 దాటినా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టినా నిత్యావసరాల పేరిట రహదారులపై కనిపిస్తున్నారు.
నిజామాబాద్లో లాక్డౌన్, లాక్డౌన్ వేళ రోడ్లపై తిరుగుతున్న జనం
లాక్డౌన్ మినహాయింపు వేళల్లో మార్కెట్, ఇతర అవసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు... అదే సాకుతో 11గంటల వరకూ తిరుగుతూనే ఉన్నారు. నగరంలో అన్ని ప్రధాన కూడళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.