నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 18వ వార్డుకు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2020లో తెరాస కౌన్సిలర్ చనిపోవడంతో నేడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
బోధన్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
బోధన్ పట్టణంలో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్-19 నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
బోధన్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
ఓటర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదడుగుల దూరముండేలా సర్కిళ్లు వేశారు. మాస్కు ధరించి వస్తేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్ స్టాండ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
ఇదీ చూడండి:లైవ్ అప్డేట్స్: రాష్ట్రంలో కొనసాగుతున్న మినీ పుర పోరు పోలింగ్