నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులోని మామిడిపల్లి వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు. పసుపు పంటకు రూ.15 వేలు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారిపై పసుపు రైతుల ఆందోళన - pasupu farmers dharna Nizamabad district
నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 44పై బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
జాతీయ రహదారిపై పసుపు రైతుల ఆందోళన
జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్, భాజపా మినహా అన్ని పార్టీలు రైతులకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చూడండి :కాళేశ్వరం గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
Last Updated : Jan 9, 2021, 3:35 PM IST