తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవో నెంబర్​ 14 అమలు చేయాలి: పొరుగు సేవల సిబ్బంది - జీవో నెంబర్​ 14 సరిగా అమలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో జీవో నెంబర్​ 14 అమలు చేయాలని పొరుగు సేవల సిబ్బంది సమ్మెకు దిగారు. 274 మంది ఉద్యోగుల్లో 45 మందికి మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు.

జీవో నెంబర్​ 14 సరిగా అమలు చేయాలి: పొరుగు సేవల సిబ్బంది

By

Published : Nov 25, 2019, 3:30 PM IST

జీవో నెంబర్​ 14 సరిగా అమలు చేయాలి: పొరుగు సేవల సిబ్బంది
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జీవో నెంబర్ 14 అమలు చేయాలని పొరుగు సేవల సిబ్బంది సమ్మెకు దిగారు. ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 14 ఇచ్చినా.. యూనివర్సిటీ అధికారులు తమ నిర్లక్ష్య వైఖరితో సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు.

విశ్వవిద్యాలయంలో 274 మంది అవుట్​సోర్సింగ్​ సిబ్బంది పని చేస్తున్నారని.. అందులో కేవలం 45 మందికి మాత్రమే జీవో అమలు చేస్తున్నారని తెలిపారు. తాము ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కోరారు.

ABOUT THE AUTHOR

...view details