తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుని పెళ్లికి వెరైటీ కానుక.. ఏమిచ్చారో చూడండి!

మిత్రుని పెళ్లంటే... ఎలాంటి బహుమతివ్వాలి...! కొంచెం భిన్నమైన వాటిని బహూకరించేందుకు ఆసక్తి చూపిస్తారు స్నేహితులు. నిజామాబాద్​ జిల్లా నాలేశ్వర్​లో జరిగిన ఓ పెళ్లిలో మరీ భిన్నంగా ఆలోచించి... అందరూ ఆశ్చర్యపోయే కానుకను వధూవరులకు అందించారు.

ONIONS GIFTED TO COUPLES IN A WEDDING
ONIONS GIFTED TO COUPLES IN A WEDDING

By

Published : Dec 11, 2019, 11:23 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్​లో జరిగిన వివాహంలో వధూవరులకు విచిత్ర బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్నేహితులు. రొయ్యల శేఖర్,చందన వివాహ మహోత్సవంలో మిత్ర బృందం రెండు కిలోల ఉల్లిగడ్డలు పెళ్లి కానుకగా అందజేశారు. ఇటీవల ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం వల్ల విలువైన బహుమతిగా భావించిన మిత్రులు... వివాహ కానుకగా ఉల్లిని బహూకరించారు. కానుకను చూసి మంటపంలో ఉన్న బంధు మిత్రులంతా గొల్లున నవ్వుకున్నారు.

స్నేహితుల వెరైటీ కానుక... ఆశ్చర్యపోయిన వధూవరులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details