నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. తెరాస నుంచి మాక్లూర్ జడ్పీటీసీగా ఎన్నికైన దాదన్నగారి విఠల్ రావు పేరును ప్రతిపాదించగా అంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా ఎడపల్లి జడ్పీటీసీ రజిత యాదవ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారిని మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అభినందించారు. కామారెడ్డి ఛైర్మన్‌గా శోభ, వైస్ ఛైర్మన్ ప్రేమ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు జిల్లా పరిషత్‌లను గులాబీ పార్టీ దక్కించుకోవడంతో తెరాస శ్రేణులు సంబురాల్లో ముగినిపోయాయి.
నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా విఠల్ రావు ఎన్నిక - నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా విఠల్ రావు ఎన్నిక
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నిగారి విఠల్ రావు, వైస్ ఛైర్మన్‌గా రజిత యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా విఠల్ రావు ఎన్నిక