తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు: కేంద్రం - పసుపు బోర్డు వార్తలు

turmeric board
తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు: కేంద్రం

By

Published : Mar 15, 2021, 8:24 PM IST

Updated : Mar 15, 2021, 10:04 PM IST

20:21 March 15

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు: కేంద్రం

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ నెల 12న తెరాస ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో పసుపు ఎగుమతుల కార్యక్రమాలు ప్రోత్సహించడం, దిగుబడుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి... నిజామాబాద్‌లో రీజినల్ ఆఫీస్ కం ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పసుపుతోపాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహం కోసం పనిచేసే బోర్డుకు... హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు.  

భారత్‌లో పదకొండున్నర లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుందని... ప్రపంచంలో 73 శాతం పసుపు భారత్ నుంచే వస్తుందని కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధికంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబంగ సహా పలు రాష్ట్రాల్లో పసుపు పండుతోందని వివరించారు.  

2019-20లో తెలంగాణలో 55,444 ఎకరాల్లో పసుపు సాగు చేయగా.. 3.86 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో సగటున హెక్టార్‌కు 3,898 కిలోల  దిగుబడి రాగా.. తెలంగాణలో అంతకు 79 శాతం అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో పదకొండున్నర లక్షల టన్నుల ఉత్పత్తిలో 33.52 శాతం తెలంగాణ నుంచే వచ్చినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు

ఇవీచూడండి:కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ తప్పకుండా మంజూరు చేయాలి: నామ

Last Updated : Mar 15, 2021, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details