జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో, ప్రభుత్వం రైతులకు వివిధ కారణాలను చూపుతూ కోతలు విధించడం సమంజసం కాదన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీ అన్నారు. కష్ట పడి పండించిన ధాన్యాన్ని వ్యర్థాల పేరుతో మింగేస్తూ... కమిషన్ కోసం మిల్లర్లు ఆశ పడుతున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం : ఎంపీ అర్వింద్ - PADDY PURCHASE UNIT
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు.
వ్యర్థాల పేరుతో రైతులను దోచుకుంటున్నారు : ఎంపీ
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో పలువురు తెరాస నాయకులు పోలీసులు కన్నుగప్పి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పర్యటన ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇవీ చూడండి :దేశంలో లాక్డౌన్ 3.0 ఖాయమే.. అతి త్వరలోనే ప్రకటన