లాక్డౌన్ వల్ల రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో తగ్గిపోయిన రక్త నిల్వలు పెంచడానికి నిజామాబాద్ యువత ముందుకొచ్చింది. గోవూరు గ్రామానికి చెందిన రెడ్ పాంథర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు రక్త దానం కార్యక్రమం నిర్వహించారు.
బ్లడ్ బ్యాంక్‌లో తగ్గిన నిల్వలు.. రక్తదానం చేసిన యువకులు
కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ వల్ల రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తగ్గిపోయాయి. నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో రెడ్ పాంథర్స్ యూత్, గోవూరు గ్రామానికి చెందిన యువకులు రక్తదానం చేశారు.
రెడ్‌క్రాస్ బ్లడ్బ్యాంక్కై నిజామాబాద్ యువత రక్తదానం
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, గోవూరు గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డితో పాటు మరో 17 మంది యువకులు రక్త దానం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, గర్భిణీలు రక్త నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజశేఖర్ అన్నారు. వారి అవసరాన్ని అర్థం చేసుకుని రక్త నిల్వలు పెంచేందుకు ముందుకొచ్చి శిబిరాన్ని నిర్వహించిన యువతను అభినందించారు.
- ఇదీ చూడండి:ప్రశంసల వెల్లువలు.. భగీరథ నల్లా నీళ్లు..!