Nizamabad Students Stuck in Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టడంతో అక్కడ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస క్షిపణి దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని జీవిస్తున్నారు. పలువురు ప్రాణాలు వదిలారు. అక్కడ విద్య, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వీరిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇంజినీర్లు కూడా ఉన్నారు..
Nizamabad People Stuck in Ukraine : సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు సైతం అక్కడికెళ్లి స్థిరపడ్డారు. నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఐదేళ్లుగా ఉక్రెయిన్‌లో ఉంటోంది. కంఠేశ్వర్‌కు చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా అక్కడ జీవిస్తున్నాడు. కొందరు వైద్య యూనివర్సిటీల్లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. యుద్ధం మొదలైన నేపథ్యంలో రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలియట్లేదని మదనపడుతున్నారు.
Russia Ukraine War : ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం పలు కన్సెల్టెన్సీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభానికి రెండు మూడు నెలల ముందు నుంచి వీరు జిల్లాలో డెమో తరగతులు, ప్రచారాలు నిర్వహిస్తుంటారు. ఇలా ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేసేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
తక్కువ ఖర్చని వెళ్తే..
Russia Ukraine War Updates : ఉక్రెయిన్‌లో వైద్య విద్యను చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు ఫీజులు చెల్లిస్తే యూనివర్సిటీల ద్వారా ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా మంది నిజామాబాద్ విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకొని తిరిగొచ్చారు. వీరిని చూసి పదుల సంఖ్యలో తాజాగా మొదటి సంవత్సరంలో చేరినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ న్యాల్‌కల్ రోడ్డులో ఉండే ఓ యువతి మొదటి సంవత్సరం కోసం గతేడాది ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఈమెతో పాటు పలువురు విద్యార్థులు అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఇవీ చదవండి :
- Russia-Ukraine Crisis: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా.. నిపుణులు ఏం అంటున్నారంటే?!
- యుద్ధభూమిలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. భయంతో బిక్కుబిక్కుమంటూ..
- రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో ఇవి ప్రియం!
ఇక్కడే అధికం
Russia Ukraine War News : విద్య, ఉద్యోగాల కోసం ఉక్రెయిన్‌కి వెళ్లిన మన వారు ఎక్కువగా రాజధాని కీవ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. విన్నిసియా, ఇవానో ఫ్రాంక్విస్క్, ఖార్కివ్ తదితర నగరాల్లోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.
గంటకోసారి ఫోన్ చేస్తున్నాం