నిజామాబాద్ జిల్లాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. పోలాంగ్ చౌరస్తాలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన రథయాత్ర కిసాన్ గంజ్ వరకు కొనసాగింది. హరే రామ హరే కృష్ణ భజనలతో ప్రధాన కూడళ్లు మార్మోగాయి. అనంతరం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. యువత ఆధ్యాత్మికం వైపు నడిచేలా అందరు కృషిచేయాలని ఎంపీ అర్వింద్ అన్నారు.
ఇందూరులో ఘనంగా జగన్నాథ రథయాత్ర - mp arvind
నిజామాబాద్ జిల్లాలో జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. యువత ఆధ్యాత్మికంవైపు దృష్టిసారించేలా అందరూ కృషిచేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

ఇందూరులో ఘనంగా జగన్నాథ రథయాత్ర