'పదవుల కంటే సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి'
పదవుల కంటే సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలతో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నగరంలో సమావేశమయ్యారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యానికి గురైన పేద పిల్లలకు కార్పొరేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 130 మంది చిన్నారుల ప్రాణాలను ఈ ట్రస్టు ద్వారా కాపాడామని వెల్లడించారు. పదవుల కంటే సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయన్నారు. చిన్నారులతో కలిసి అర్వింద్ భోజనం చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులకు దీపావళి కానుకలు అందించారు.
- ఇదీ చూడండి : 'మీ మనసు నొచ్చుకుంటే నాకు బాధైతది'