రాజకీయ డ్రామాలో భాగంగానే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందని.. బోర్డు ఏర్పాటు ఆలోచన ఉంటే తప్పకుండా తెలంగాణకే అవకాశం ఉంటుందని చెప్పారు.
కేసీఆర్ కుటుంబం జైలుపాలు కావడం ఖాయం: అర్వింద్
అటవీ భూములను మైనింగ్‌కు ఇచ్చిన కేసీఆర్ కుటుంబం జైలుపాలు కావడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. పసుపు బోర్డు ఏర్పాటు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందని.. బోర్డు ఏర్పాటు ఆలోచన ఉంటే తప్పకుండా తెలంగాణకే అవకాశం ఉంటుందని చెప్పారు.
అర్వింద్
రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎస్ కింద ధర నిర్ణయించి కేంద్రానికి పంపితే మార్కెట్ లోటును భరిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం ఓడిపోతే.. తెల్లారే విమానం ఎక్కి దేశం విడిచి పారిపోతారన్నారు. అటవీ భూములను మైనింగ్‌కు ఇచ్చిన కేసీఆర్ కుటుంబం జైలుపాలు కావడం ఖాయమన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో భాజపా బలోపేతం అవుతోందని.. అనేక మంది పార్టీలో చేరారని.. జగిత్యాల జిల్లాలో త్వరలోనూ ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని అర్వింద్ చెప్పుకొచ్చారు.