తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు - NIZAMABAD FORMERS

దేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్​ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక్కడ పోటీ చేసిన రైతులకు 94 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోటీ చేసిన రైతుల్లో విప్పల లచ్చన్నకు అత్యధికంగా 6వేల 96 ఓట్లు లభించాయి. కేసీఆర్​ కుమార్తె కవిత 71 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు.

ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు

By

Published : May 24, 2019, 12:22 PM IST

నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గం ఫలితాన్ని పసుపు, ఎర్రజోన్న రైతులు తారుమారు చేశారు. ఈ నియోజకవర్గం నామినేషన్ల నుంచి ఫలితాల వెల్లడి వరకు రికార్డుల మోత మోగించింది. దేశంలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో రైతులే 175 మంది. గెలుపొందిన భాజపా అభ్యర్థికి లభించిన మెజారిటీ కన్నా రైతులకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి.

ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు

ప్రచారం చేయకపోయినా...

దేశంలో తొలి సారి అత్యాధునిక ఈవీఎంలను వినియోగించి ఎన్నికలు నిర్వహించారు. ఫలితాల వెల్లడిలో కూడా మరో దఫా ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రచారం చేయకపోయినా... రైతులకు మొత్తంగా 94వేల 882 ఓట్లు పోలయ్యాయి. తెరాస అభ్యర్థి కవిత 71 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

డిపాజిట్ దక్కని మధుయాస్కీ:

కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయని కారణంగా కిందిస్థాయి క్యాడర్ ఓట్లు ప్రతినియోజకవర్గంలో చీలిపోయినట్లు తెలుస్తోంది. పోటీ చేసిన రైతుల్లో విప్పల లచ్చన్నకు అత్యధికంగా 6వేల 96 ఓట్లు లభించాయి. సుమారు 20 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి మూడు వేల ఓట్ల వరకు వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మధుయాస్కీకి కనీసం డిపాజిట్​ దక్కకపోవడం విశేషం.

వారణాసిలోనూ ఇందూరు రైతు:

వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసిన నిజామాబాద్​ జిల్లాకు చెందిన రైతు సున్న ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడుకు చెందిన నలుగురితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి 50 మంది అన్నదాతలు వారణాసిలో పోటీ చేసేందుకు వెళ్లారు.

ఇందులో 25 మంది నామినేషన్లు దాఖలు చేయగా 24 తిరస్కరణకు గురయ్యాయి. ఏర్గట్ల గ్రామానికి చెందిన ఇస్తారి నామినేషన్ ఒక్కటే అర్హత సాధించింది. అయితే గురవారం చేపట్టిన లెక్కింపులో ఇస్తారికి 787 ఓట్లు పడ్డాయి. ఎన్నికల ప్రచారం చేయకున్నా... ఎవరికీ పరిచయం లేకున్న కొందరు ఆయనకు మద్దతుగా ఓట్లేశారు.

ఇదీ చూడండి:'భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details