తెలంగాణ

telangana

ETV Bharat / state

'పసుపు బోర్డు తీసుకురా.. లేకపోతే రాజీనామా చేయ్' - ఎంపీ అర్వింద్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్​పై.. జిల్లా తెరాస నాయకుడు పొద్దుటూరి జగత్ రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు సాధించడం చేతకాకపోతే.. రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Nizamabad District Trs leader Podduturi Jagat Reddy was incensed on mp Arvind
'పసుపు బోర్డు తీసుకురా.. లేకపోతే రాజీనామ చేయ్'

By

Published : Mar 17, 2021, 1:47 PM IST

పసుపు బోర్డుపై ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు కె.ఆర్ సురేశ్ రెడ్డిని విమర్శించడం మానుకొని.. బోర్డు సాధనకు కృషి చేయాలని ఎంపీ అర్వింద్​కు జిల్లా తెరాస నాయకుడు పొద్దుటూరి జగత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంపీ సురేశ్​ రెడ్డిపై.. అర్వింద్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను జగత్​ రెడ్డి ఖండించారు. బోర్డు సాధించడం చేతకాకపోతే.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:గవర్నర్ ప్రసంగం చూసైనా విమర్శకులు పంథా మార్చుకోవాలి: బాలరాజు

ABOUT THE AUTHOR

...view details