కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తమై స్వచ్ఛంద లాక్డౌన్ని విధించుకుంటున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని కిరాణా, వర్తక సంఘాలు ఒకతాటిపైకి వచ్చి ప్రతి శుక్రవారం సంపూర్ణ లాక్డౌన్ను పాటిస్తున్నారు. అలాగే ప్రతీ శుక్రవారం నివర్వహించే వారాంతపు సంతను కూడా తీసేశారు.
కరోనా కారణంగా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామాలలోని ప్రజలు అప్రమత్తమై మహమ్మారి బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
కరోనా కారణంగా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచేలా తీర్మానం చేసుకున్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయేవరకూ లాక్డౌన్ కొనసాగిస్తామని చెబుతున్నారు.