నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. కమ్యూనిటీకి విస్తరించకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. పాజిటివ్ వ్యక్తులతో 774మంది ప్రాథమికంగా కంటాక్ట్ అయిన వారిని గుర్తించి పరీక్షలు చేయనున్నారు. దిల్లీ వెళ్లొచ్చిన వారిలోనే కరోనా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఏ ఒక్కరికీ కరోనా రాలేదని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం అంతా కరోనా కట్టడికి సిద్ధంగా ఉందని చెబుతోన్న పాలనాధికారి నారాయణరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
జిల్లాలో కరోనా కట్టడికి సిద్ధంగా ఉన్నాం : కలెక్టర్ నారాయణ రెడ్డి - COLLECTOR INTERVIEW ON CORONA
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీకి వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా కట్టడికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.
వచ్చే 15 రోజులు బయటకు రాకండి : కలెక్టర్