మిషన్ భగీరథ, హరితహారం, తడి పొడి చెత్త సేకరణ, తదితర అంశాలపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు. గ్రామాల్లో పైప్లైన్లు, పాత వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.
అధికారులతో జిల్లా పాలనాధికారి దృశ్యమాద్యమ సమీక్ష - హరితహారం
నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, హరితహారం, తడి పొడి చెత్త సేకరణ, తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల్లో పైప్లైన్లు, పాత వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.
నల్లా కనెక్షన్లను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో పైప్‌లైన్ మరమ్మతులు చేసినప్పుడు రోడ్లు చెడిపోతే వెంటనే బాగు చేయించాలన్నారు. ఒక్కసారి గ్రామంలో పనిచేస్తే మళ్లీ వెళ్లకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లత, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్‌కుమార్, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్