నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాపై కలెక్టర్ స్పష్టతనిచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను తన అసలు ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
నకిలీ ఖాతా ద్వారా కలెక్టర్ ఫేస్బుక్ ఖాతాతో చాటింగ్ చేస్తూ తమ బంధువులకు సీరియస్గా ఉందని, ఐసీయూలో ఉన్నారని సైబర్ నేరస్థులు అందులో పేర్కొన్నారు. డబ్బులు కావాలని మళ్లీ తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలికారు.