తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తాం' - untimely rains

జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. రైతులంతా అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

nizamabad collector
nizamabad collector

By

Published : May 3, 2021, 7:45 PM IST

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు.. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో.. ఆయన టెలీ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

తక్కువగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తూకం వేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్​ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. రైతులంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ

ABOUT THE AUTHOR

...view details