తెలంగాణ

telangana

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: కొడుకు వదిలేసిన తల్లిని పరామర్శిచిన సివిల్​ జడ్జి

కరోనా వచ్చి తగ్గాక తల్లి వస్తే కుమారుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిన ఘటనపై ఈటీవీ భారత్​లో 'ఆదరణకు నోచుకోక.. తల్లిపేగు విలవిల' అంటూ వచ్చిన కథనానికి నిజామాబాద్​ జిల్లా సివిల్​ జడ్జి జస్టిస్ కిరణ్మయి స్పందించారు. వృద్ధురాలి దగ్గరకు వెళ్లి ఆమెకు భరోసా కల్పించారు.

By

Published : Sep 21, 2020, 2:26 PM IST

Published : Sep 21, 2020, 2:26 PM IST

nizamabad civil judge visited old woman cured from corona
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: కొడుకు వదిలేసిన తల్లిని పరామర్శిచిన సివిల్​ జడ్జి

కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత తల్లి వస్తే.. ఇంటికి తాళం వేసుకుని కుమారుడు వెళ్లిపోయిన ఘటనపై నిజామాబాద్​ జిల్లా సీనియర్​ సివిల్​ జడ్జి జస్టిస్​ కిరణ్మయి స్పందించారు. ఈటీవీ- ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందించి వృద్ధురాలు బాలామణిని చూసుకునేందుకు వర్నికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. నగరంలోని రోటరీ నగర్​లో వృద్ధురాలు బాలమణి ఇంటికి జస్టిస్​ కిరణ్మయి వెళ్లి ఆమెను పరామర్శించారు.

అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించి.. బాలామణికి భరోసా కల్పించారు. నగర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని వృద్ధురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. సీఐ సత్యనారాయణ ఆమె కుమారుడితో మాట్లాడి.. అతనికి నచ్చజెప్పారు. ఆమె కుమారుడు హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​ బయలుదేరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండిఃఆదరణకు నోచుకోక.. తల్లిపేగు విలవిల

ABOUT THE AUTHOR

...view details