భాజాపా జాతీయ పార్టీ కనుక మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని పొందుపర్చలేదని ఆపార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇందూరులోని మార్కెట్ యార్డులో పసుపు రాశులను పరిశీలించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలులో తెరాస సర్కారు విఫలమైందన్నారు. భాజపాకు మద్దతివ్వాలని కార్మికులను అభ్యర్థించారు. తాను పసుపు బోర్డును తేలేకపోతే రాజీనామా చేసి రైతుల తరఫున ఉద్యమం చేస్తానన్నారు.
'హామీలు నెరవేర్చలేక పోతే రాజీనామా చేసి ఉద్యమిస్తా' - turmeric board
నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డును లోక్‌సభ భాజాపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పరిశీలించారు. తమ మేనిఫెస్టోలో పొందు పర్చకపోయినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేసితీరుతామని హామీ ఇచ్చారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తా