ఇందూరులో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం - nijamabad
13:58 February 04
నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచినట్లు తెలిపారు. ఐఏఎస్ హోదా ఉన్న అధికారి డైరెక్టర్ స్థాయి అధికారితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాలయం నేరుగా మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని పేర్కొన్నారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గోయల్ తెలిపారు. ఇవాళ లేదా రేపు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
TAGGED:
nijamabad