నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన సందీప్ అనే యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన సుమారు 100 మంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు సీపీ కార్తికేయలను కలిసి వినతి పత్రం అందజేశారు.
'యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి'
బోధన్‌లో జరిగిన ఓ యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు. బాధ్యులను శిక్షించాలని కోరుతూ కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు సీపీ కార్తికేయలను కలిసి వినతి పత్రం అందజేశారు.
'యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి'
నవీపేట్ మండలంలోని కంఠం గ్రామానికి చెందిన యువకుడిని అదే గ్రామానికి చెందిన యువతి కుటుంబీకులు, ప్రేమ వ్యవహారంలో బోధన్‌కు పిలిపించి 12 మంది కలిసి హత్య చేశారని మృతుడి తల్లి నర్సుభాయి పేర్కొన్నారు. అయితే హత్య చేసిన వారిలో ఒకరిపై మాత్రమే కేసు నమోదు చేశారని, నలుగురిని బెయిల్‌పై వదిలేశారని, మరో 7గురిని వదిలేశారని తెలిపారు. కావున అధికారులు హత్యకు పాల్పడిన 12 మందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.