తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతిగృహ ఉద్యోగి సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్ - ఈటీవీ కథనానికి స్పందన

నిజామాబాద్​లోని ఇందల్వాయి వసతి గృహంలో మద్యం సేవించి విద్యార్థులను కొట్టి దుర్భాషలాడిన పొరుగు సేవల ఉద్యోగిపై అధికారులు చర్యలు ప్రారంభించారు. సదరు ఉద్యోగి విట్టల్​ను సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్​ చేశారు.

ఈటీవీ కథనానికి స్పందన

By

Published : Aug 26, 2019, 11:43 PM IST

ఈటీవీ కథనానికి స్పందన... వసతిగృహంలో విచారణ

నిజామాబాద్​లోని ఇందల్వాయి సంక్షేమ​ వసతిగృహంలో విద్యార్థులతో సిబ్బంది అనుచిత ప్రవర్తనపై "ఈటీవీ, ఈటీవీ భారత్" కథనాలకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఎంపీడీవో రాములు నాయక్​, స్థానిక సర్పంచ్​ ప్రజా ప్రతినిధులతో కలిసి వసతి గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. మద్యం సేవించి విద్యార్థులను దుర్భాషలాడిన పొరుగుసేవల ఉద్యోగి విట్టల్​ను సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్​ చేశారు. ఘటనపై తోటి సిబ్బంది, విద్యార్థులు గ్రామస్థులను విచారించారు. అయితే గతంలో విట్టల్​ వ్యవహారం తన దృష్టికి వచ్చినప్పుడు అతన్ని మందలించానని వార్డెన్​ అధికారులకు తెలిపారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో వార్డెన్​ను హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details