తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాచారం ఇవ్వలేదంటూ ఎంపీపీ నిరసన - యమున

మండల ప్రజా పరిషత్​లో ఏర్పాటు చేసిన సర్పంచ్​ల సమావేశానికి ఎంపీపీని పిలవకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏంటని స్థానిక నేతలు ఎంపీడీవోను ప్రశ్నించారు.

అధికారితో మాట్లాడుతున్న నేతలు

By

Published : Feb 8, 2019, 5:50 PM IST

Updated : Feb 8, 2019, 9:40 PM IST

ఎంపీపీ నిరసన
నిజామాబాద్ జిల్లా నందిపేట్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సర్పంచుల సమావేశానికి పిలవలేదని ఎంపీపీ అంకంపల్లి యమున నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉన్నట్లు తనకెందుకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవో నాగవర్ధన్​ను ప్రశ్నించారు. షెడ్యూల్డ్ అభ్యర్థి కావడం వల్లే చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీవోను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఎంపీడీవో సమాధానంతో సంతృప్తి చెందక యమున కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎంపీపీకి ఎస్సీ నాయకులు మద్దతు తెలిపారు.

Last Updated : Feb 8, 2019, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details