తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా క్లీన్‌స్వీప్‌ చేస్తాం: అర్వింద్​

ప్రజలు భాజపా నేతలపై ఎందుకు దాడి చేస్తారు ఎంపీ అర్వింద్‌ ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగుల ముసుగులో తెరాస నేతలు దాడిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలను తెరాస నేతలు ఆవిష్కరించడంపై మండిపడ్డారు.

arvind
arvind

By

Published : Feb 19, 2022, 5:07 PM IST

ఇప్పటికిప్పుడు నిజామాబాద్‌లో ఎన్నికలు పెట్టినా... భాజపా అన్ని నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఎంపీ అర్వింద్‌ ధీమా వ్యక్తం చేశారు. రైతులు, నిరుద్యోగుల ముసుగులో తెరాస నేతలు దాడిచేస్తున్నారని ఆరోపించారు. ధర్పల్లిలో భాజపా కార్యకర్తలు ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాలను తెరాస నేతలు ఆవిష్కరించడాన్ని ఎంపీ తీవ్రంగా ఆక్షేపించారు.

భాజపా ఎదుగుదలను ఏ తెరాస నాయకుడు ఆపలేడని అర్వింద్ అన్నారు. కమలం పువ్వు వికసించేసిందని చెప్పారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో 90 శాతం నిధులు కేంద్రానివని పేర్కొన్నారు. తెరాసకు పరాయి సొమ్ము తినడం అలవాటైందని విమర్శించారు. ఆర్మూర్​లో తమపై దాడి చేసి రైతులపై నింద వేశారని అన్నారు. ధర్పల్లిలో దాడి చేసింది నిరుద్యోగులా అని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వలేదని భాజపా నేతలపై మహిళలు దాడి చేస్తారా అని అన్నారు.

ధర్పల్లిలో దాడి ఎవరు చేశారని ఎంపీ అర్వింద్​ నిలదీశారు. భైంసా అల్లర్ల బాధితులను నెలల తరబడి జైళ్లల్లో ఉంచారని మండిపడ్డారు. ధర్పల్లిలో తెరాస నాయకులు ఆవిష్కరించిన శివాజీ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి... భాజపా కార్యకర్తతో అయినా ఆవిష్కరిస్తామని చెప్పారు. హిజాబ్​కు మద్దతుగా ర్యాలీలు చేస్తే అనుమతి ఇస్తున్నారని... శివాజీ, హనుమాన్​ జయంతికి శోభాయాత్ర చేస్తే మాత్రం అనుమతి ఇవ్వరని మండిపడ్డారు.

ఇదీ చదవండి :ఇక నుంచి కాంగ్రెస్​ పార్టీ గుంపులో లేను: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details