కన్న తల్లిని చంపిన తనయుడు - తల్లి
నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయుడే ఆ తల్లి పాలిట యముడయ్యాడు. రోకలిబండతో కొట్టి హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొనుగొప్పులలో జరిగిన ఈ ఘటన అందిరిని కలచి వేసింది.
చనిపోయిన లక్ష్మి
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొనుగొప్పులలో దారుణం జరిగింది. కన్న తల్లిని ఓ కసాయి కొడుకు రోకలిబండతో కొట్టి చంపాడు. నిందితుడు అంజయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకునేందుకు డబ్బు కావాలని ఆదివారం ఉదయం తల్లి లక్ష్మితో గొడవ పడ్డాడు. అవేశంలో అమ్మను రోకలిబండతో కొట్టాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.