ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని మానవత సదన్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో సేవా సప్తహా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మోదీ పాలన భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయని, దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలన భవిష్యత్ తరాలకు ఆదర్శం: ఎంపీ అర్వింద్ - నిజామాబాద్ జిల్లా
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో సేవా సప్తహా కార్యక్రమం నిర్వహించారు.
మోదీ పాలన భవిష్యత్ తరాలకు ఆదర్శం: ఎంపీ అరవింద్