ఎమ్మెల్సీ కవిత రోడ్డు పక్కన పడిపోయి ఉన్న మహిళకు సాయం అందించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ ప్రాంతంలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న కవిత... ఆమెను గమనించారు. మహిళ వద్దకు వెళ్లి పరామర్శించి... తన వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అపస్మారక స్థితిలో మహిళ.. ఎమ్మెల్సీ కవిత మానవత్వం - కవితక్క వార్తలు
రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను ఎమ్మెల్సీ కవిత ఆదుకున్నారు. ఆమెను పరామర్శించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కవిత నిజామాబాద్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అపస్మారక స్థితిలో మహిళ... ఆదుకున్న ఎమ్మెల్సీ కవిత