MLC Kavitha Fires on Rahul Gandhi రాహుల్ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి MLC Kavitha Fires on Rahul Gandhi in Nizamabad : విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి రాహుల్ గాంధీ ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అందుకే రాహుల్ జీ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండని వ్యంగ్యంగా చురకలు అంటించారు. నిజామాబాద్‌లోని బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల(MLC Kavitha Election Campaign)తో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని.. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
MLC Kavitha Rahul Gandhi Nizamabad Tour :నిజామాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కవిత తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి తమకు ఏమీ చెప్పనక్కరలేదని వ్యాఖ్యానించారు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. వేల మంది బీసీ యువకులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం.. సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు.
MLC Kavitha on Rahul Gandhi Comments : సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్ గాంధీకి అలవాటే: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha on Rythu Bandhu Scheme :రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. రైతులపై రాజకీయం చేయడం కాంగ్రెస్ నేతల నైజమని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్‌కు వందల కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. గత చరిత్రను చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా సీఎంను మార్చాలని చూపినప్పుడల్లా మత కల్లోలాలు రేపింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతగా అభివృద్ధి జరిగిందా అని రాహుల్ గాంధీని కవిత ప్రశ్నించారు.
"రైతులను కాపాడుకునే నైజం సీఎం కేసీఆర్‌ది. రైతులతో రాజకీయం చేసే నైజం రాహుల్ గాంధీది. రాజకీయం కోసం రెండు మాటలను చెప్పే నాయకులను నమ్ముతారో.. ఎలక్షన్ ఉన్నా లేకున్నా మీతో పాటు నిలబడే వాళ్లను నమ్ముతారో ప్రజలే తేల్చుకోవాలి. అన్ని మతాలు కలిసి తెలంగాణలో చాలా శాంతియుతంగా ఉంటున్నాం. హైదరాబాద్‌లో ఈరోజు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి."- కవిత, ఎమ్మెల్సీ
MLC Kavitha Election Campaign at Boathan :65 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమిటో రాహుల్‌గాంధీ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. మంచి వాతావరణం మళ్లీ చెడగొట్టకండని హితవు పలికారు. నిజామాబాద్‌లో అంకాపూర్ చికెన్ రుచి చూడాలని రాహుల్‌ను కవిత కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాహుల్ గాంధీకి తెలంగాణ గుర్తుకు వస్తుందా అంటూ కవిత ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MLC Kavitha Bathukamma Song : 'అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా'.. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా..?
MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీవి దిగజారుడు మాటలు'