పసుపు రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై అర్వింద్ హామీ ఏమైందని ప్రశ్నించారు. చక్కెర పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వపరం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మరిచి... సహకార రంగంలోని 3 చక్కెర పరిశ్రమలను మూసివేశారని ఆరోపించారు.
పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ హామీ ఏమైంది..?: జీవన్ రెడ్డి
పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ఇచ్చిన హామీ ఏమైందని... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. చక్కెర పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వ పరం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మరిచారని ఆరోపించారు. సాగు చట్టాలపై తెరాస వైఖరిపై చెప్పాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ హామీ ఏమైంది..?: జీవన్ రెడ్డి
ఖాయిలాపడిన పరిశ్రమలను కేంద్రం కూడా పునరుద్ధిరించవచ్చని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే కనీల మద్దతు ధర ఉంటుందని పేర్కొన్నారు. దశాబ్ధాలుగా ఉన్న ఎంఎస్పీని మోదీ ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలల క్రితం ఆందోళన చేసిన తెరాస... ఇప్పడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటం