నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చాంద్రాయన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్లైన్ బుధవారం లీకైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న పైప్లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది.
రోడ్డుపై మిషన్ భగీరథ ఫౌంటెయిన్
నిజామాబాద్ జిల్లా చాంద్రాయన్పల్లి సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకైంది. పెద్దఎత్తున నీరు ఎగిసిపడటంతో తాగునీరంతా వృథాగా పోయింది.
భగీరథ పైప్లైన్ లీక్
పైపుల నిర్మాణంలో నిర్లక్ష్యంతోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు చేతికందే సమయంలో ఇలాంటి లీకేజీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. లీకేజీలను పకడ్బందీగా అరికట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Krishna Water: 'కృష్ణా బేసిన్లో నీరు వినియోగించుకునేలా మార్పు చేయండి'